వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) 2023-2025 విశ్వ విజేతగా బావుమా నేతృత్వంలోని సౌత్ ఆఫ్రికా టీం విజేతగా నిలిచింది. ప్రతిశతాత్మక లార్డ్స్ వేదికగా శనివారం (జూన్ 14-2025) ఆస్ట్రేలియా తో ముగిసిన ఫైనల్ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాదించింది. సౌత్ ఆఫ్రికా ఓపెనర్ మార్కరమ్ 207 బంతుల్లో 136 : 14 ఫోర్లు) బాదీ సూపర్ సెంచరీ సాదించగా బావుమ (66) కెప్టన్ ఇన్నింగ్స్ ఆడి సౌత్ ఆఫ్రికాను WTC విజేతగా నిలిపారు. క్రికెట్ చరిత్రలో ప్రోటీస్ టెస్ట్ చాంపియన్ షిప్ గెలవడం సౌత్ ఆఫ్రికా జట్టుకు ఇదే తొలిసారి కావడం విశేషం .
దాదాపు 27 ఏళ్ల తరువాత సౌత్ ఆఫ్రికా జట్టు ఐసీసీ టైటిల్ గెలవడం కూడా మొదటిసారి. సౌత్ ఆఫ్రికా జట్టు చివరిసారిగా 1998 సంవత్సరంలో చాంపియన్ ట్రోఫీ రూపంలో సౌత్ ఆఫ్రికా ఐసీసీ టైటిల్ గెలిచింది అప్పటి నుండి ఐసీసీ టోర్నీ కోసం కళ్ళు కాయలు కాసెల ఎదురు చూస్తుంది చాలా సార్లు సెమీస్ , ఫైనల్ వరకు వెళ్ళిన సౌత్ ఆఫ్రికా జట్టు ఓటమి చెందడం ఆనవాయితీ గా మార్చుకుంది దీంతో సౌత్ ఆఫ్రికా చోకర్స్ అనే ముద్ర వేసుకుంది. చాలా ఏళ్లుగా క్రికెట్ అంటే ఇండియా ఆస్ట్రేలియా ఇంగ్లండ్, నూజిలాండ్ జట్లు మాత్రమే క్రికెట్ అనే స్థాయికి చేరుకున్నాయి కానీ చివరికి సౌత్ ఆఫ్రికా కూడా ఐసీసీ ట్రోఫీ గెలుచుకుని ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక మైలు రాయిని అందుకుంది
WTC విజేత సౌత్ ఆఫ్రికా ప్రైజ్ మని
ఇదిలా ఉంటే WTC విశ్వ విజేతగా నిలిచిన సౌత్ ఆఫ్రికా ఎంత ఫ్రిజ్ మని దక్కుతుందనే దానిపైన చర్చ జరుగుతుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ నిలిచిన సౌత్ ఆఫ్రికా జట్టుకు టెస్ట్ గద తో పాటు 3.6 మిలియన్లు ( భరత కరెన్సీ ప్రకారం రూపాయలు 31.05 కోట్లు ప్రైజె మని దక్కనుంది.
WTC రన్నర్ ఆస్ట్రేలియా ప్రైజ్ మని
WTC ఫైనల్ లో ఓటమి పాలై రన్నర్ గా మిగిలిన ఆస్ట్రేలియా జట్టు 2.16 మిలియన్లు (భారత కరెన్సీ ప్రకారం రూపాయలు 18.63 కోట్ల నగదు బహుమతి అందుకోనుంది .
ఇక 2023-25 wtc సైకిల్ లో మూడో స్థానంలో నిలిచిన భారత్ రూపాయలు 12.42 కోట్లు క్యాష్ రివార్డ్ అందుకోనుంది స్వంత గడ్డపై నూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పరాజయం పాలు కావడంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కి వెళ్ళే అవకాశాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే.ఇక 2023-25 wtc సైకిల్ లో మూడో స్థానంలో నిలిచిన భారత్ రూపాయలు 12.42 కోట్లు క్యాష్ రివార్డ్ అందుకోనుంది స్వంత గడ్డపై నూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పరాజయం పాలు కావడంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కి వెళ్ళే అవకాశాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే.
for More Sports News Please Click Here