తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా జ్యూరీ పర్సన్ జయసుద ప్రకటించారు

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ ఫిల్మ్ ఆవార్డులను జ్యూరీ చైర్ పర్సన్ సినీ నటి జయసుధ ప్రకటించారు. ఎఫ్ డి సి చైర్మెన్ దిల్ రాజు తో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్ లు రాగా వాటిని పరిశీలించిన జ్యూరీ ఈ రోజు అవార్డు గ్రహితల పేర్లను ప్రకటించింది
గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో అంధించిన నంది అవార్డు స్థానంలో ఈ అవార్డు లను ప్రభుత్వం గద్దర్ పేరుతో అందించాలని 14 ఏళ్ల తరువాత ఈ అవార్డు లను అందించనుంది. ఈ గద్దర్ అవార్డు లను మొత్తం 11 కేటగిరీలలో 2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 31 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి , 2014 నుండి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు 2024 కు సంబందించి అన్నీ కేటగిరీలలో అవార్డులను ఇచ్చారు. ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటుడు సహ మొత్తం 21 మందికి వ్యక్తిగత స్పెషల్ జ్యూరీ అవార్డు లు ఇచ్చారు ఈ యొక్క అవార్డు లను జూన్ 14 న ఈ యొక్క గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

- మొదటి ఉత్తమ ఫీచర్ చిత్రం : కల్కి 2898 ఏడీ
- రెండో ఉత్తమ ఫీచర్ చిత్రం : పొట్టేల్
- మూడో ఉత్తమ ఫీచర్ చిత్రం : లక్కీ భాస్కర్
- ఉత్తమ బాలల చిత్రం : 35 ఇది చిన్న కథ కాదు
- హిస్టరీ విభాగంలో ఫీచర్ హెరిటేజ్ చిత్రం : రాజకార్
- ఉత్తమ ప్రజాదరణ చిత్రం : ఐ అండ్ మై ఫ్రెండ్స్
- ఉత్తమ వినోదాత్మక చిత్రం : ఆయ్
- ఉత్తమ పరిచయ దర్శకుడు : యదు వంశీ (కమిటీ కుర్రాలు )
ఉత్తమ వ్యక్తిగత విభాగాల్లో అవార్డులు
- ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి)
- ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)
- ఉత్తమ నటి : నివేద థామస్ (35 ఇది చిన్నకథ కాదు )
- ఉత్తమ సహాయ నటుడు : ఎస్ జె సూర్య (సరిపోద శనివారం )
- ఉత్తమ సహాయ నటి : శరణ్య ప్రదీప్య (అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ )
- ఉత్తమ సంగీత దర్శకుడు : భీమ్స (రజాకార్ )
- ఉత్తమ నేపధ్య గాయకుడు : సిద్ శ్రీరామ్ (ఊరిపెరు భైరవ కోన
- ఉత్తమ నేపద్య గాయని : శ్రేయ ఘోషల్ (పుష్ప 2 సుసే కి అగ్గి రవ్వ )