CASTE CENSUS 2026: దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్టోబర్ నుండి జనగణన

caste census

లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండలో తొలుత జనగణన

2026, అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి ప్రారంభం

15 ఏండ్ల తర్వాత జనగణన (CASTE CENSUS) చెపడుతున్న  ప్రభుత్వం

స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి కులగణన

జనగణనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2026, అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలైన లడాక్, జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలో జనగణన (CASTE CENSUS) చేపడతారు. 2027, మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తారు. సోమవారం ఉదయం హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్, రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంతజయ్ నారాయణ్ తో పాటు పలువురు సీనియర్ అధికారులతో హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు. జనగణన ఏర్పాట్లపై సమీక్ష చేసి.. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా ఇది 16 వ జనగణన కాగా, స్వాతంత్ర్యం వచ్చాక జరుగుతున్న 8వ జనగణన. చివరి సారిగా 2011 లో జనగణన చేపట్టారు. లెక్క ప్రకారం.. 2021 లో జనగణన చేపట్టాలి. కానీ.. కరోనా కారణంగా వాయిదా వేశారు. దీంతో 15 ఏండ్ల తర్వాత జనగణన జరుగుతున్నది.

డిజిటల్ రూపంలో జనాభా (CASTE CENSUS) లెక్కింపు

ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ రూపంలో జరగబోతున్నది. టాబ్లెట్ ల ద్వారా డేటా సేకరిస్తారు. ప్రభుత్వం అందించే పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నది. ఇందుకోసం 16 భాషలతో కూడిన మొబైలు యాపలను రెడీ చేస్తున్నారు. డేటా మాత్రం సేప్ గా  ఉంటుందని హోంశాఖ భరోసా ఇచ్చింది. జనగణనలో జనాభాతో పాటు కుల గణన కూడా చేపడతారు. జనాభా లెక్కల సేకరణ కోసం 30కి పైగా ప్రశ్నలను కేంద్రం సిద్ధం చేసింది. ప్రతీ రాష్ట్రంలో 2 దఫాలో జనగణన నిర్వహిస్తున్నట్లు హోంశాఖ అధికారులు ప్రకటించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశ జనాభా 121కోట్లు. ఇందులో 62.27 కోట్ల మంది ( 51.54 శాతం) పురుషులు ఉండగా.. 58.64 కోట్ల మంది (48.46శాతం) స్త్రీలు ఉన్నారు. కాగా, 2027  జనగణలో ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే కాకుండా ఓబీసీలు సహ అన్ని కులాలను కవర్ చేసేలా కులగణన ఉందనున్నది.

జనగణన (CASTE CENSUS) ఖర్చు

జనగణన కోసం 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. 2025-2026 బడ్జెట్ లో జనగణన (CASTE CENSUS) కోసం రూ. 574.80 కోట్లు కేటాయించారు. అయితే, మొత్తం ఖర్చు రూ. 13000 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 1800 మంది మాస్టర్ ట్రైనర్లు.. 45 వేల మంది ఫీల్డ్ ట్రైనర్లకు జనగణనపై శిక్షణ ఇస్తారు. వీళ్ళు ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ జనగణన (CASTE CENSUS) రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం.. ఏడో షెడ్యూల్ లోని కేంద్ర జాబితాలో 69 వ అంశంగా జాబితా చేశారు. కుల గణన చేపట్టడం స్వాతంత్ర్యం తర్వాత ఇదే తొలిసారి. చివరి సమగ్ర కుల ఆధారిత లెక్కింపు.. 1881, 1931 మధ్య జరిగింది. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా కులాల వారీగా లెక్కలు తీయలేదు.

(CASTE CENSUS) ఫస్ట్ ఫేజ్

హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్వో ) నిర్వహిస్తారు. ఇందులో ప్రతీ ఇంటి కండిషన్ ఎలా ఉంది? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఇంట్లో ఉన్న సౌలత్లకు సంబంధించిన డేటాను సేకరిస్తారు.

(CASTE CENSUS) సెకండ్ ఫేజ్..

పాపులేషన్ ఎన్యూమరేషన్ (పీఈ ) చేపడతారు. ఈ స్టెప్ లో ఒక్కో ఇంట్లో ఎంత మంది నివాసం ఉంటున్నారు? సామాజిక, ఆర్ధిక పరిస్థితి ఏంటి? ప్రతి వ్యక్తి కల్చరల్ డీటెయిల్స్ సేకరిస్తారు. ఈ పహాసేలోనే సదరు వ్యక్తి కులం తెలుసుకుంటా. క్యాస్ట్, ఒక్కో కుటుంబంలో ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి డిజిటలైజ్ చేస్తారు.  

for more latest information please click Here

(CASTE CENSUS) ముఖ్య ఉద్దేశాలు

దేశంలో జరగబోతున్న (CASTE CENSUS) జనగణన వాస్తవంగా 2011 సంవత్సరంలో జరిగింది ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క గణననే ఉద్యోగాల కల్పనలో రాజకీయ రిజర్వేషన్ లలో ప్రభుత్వ స్కీమ్ అమలులో ఈ యొక్క లెక్కల ద్వారానే అమలు చేస్తున్నారు ఆ తరువాత మళ్ళీ 2021 సంవత్సరంలో జనగణన చేయవలసి ఉన్న కూడా ప్రపంచ వ్యాప్తంగా కరొన మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ యొక్క (CASTE CENSUS) జనగణన వాయిదా పడింది

ఇప్పుడు తాజాగా నరేంద్ర మోడి గారి ప్రభుత్వం 2026 నుండి జనాబా లెక్కలకు చేయాలని నిర్ణయించింది మొదటగా కేంద్ర పాలిత ప్రాంతాలైన రాష్ట్రాల నుండి మొదలుకుని దేశంలో ని ప్రతి ఒక ఇంటిని సందర్శించి ఈ యొక్క జనగణన (CASTE CENSUS) తో పాటు కులగణన చేయాలని నిర్ణయించింది

దేశంలో బ్రిటిష్ కాలంలో 1931 సంవత్సరంలో జరిగిన కుల గణన వివరాలను ఇప్పటి వరకు అమలు చేస్తున్నారు వివిద రాజకీయ అంశాలలో ఈ యొక్క లెక్కలను మాత్రమే అమలు చేస్తున్నారు. 2011 లో చేసిన జనాబా లెక్కల లో కేవలం దేశ జనాబాను మాత్రమే లెక్కించిన కేంద్ర ప్రభుత్వం కులగణన చేయలేక పోయింది తాజాగా భారత దేశం జనాభా పరంగా మొదటి స్థానంలో నిలిచి 140 కోట్ల జనాబాను దాటి ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా అవతరించింది. ఈ సందర్భంగా దేశంలో ఉన్న మహిళలు, పురుషులు, ట్రాన్స్ జెండర్ లు మరియు కులాల వారీగా లెక్కించి దేశంలో వివిద రకాల పథకాలను అమలు చేయడానికి వీలు ఉంటుంది. మళ్ళీ దేశంలో ఇప్పటివరకు పార్లమెంటు స్థానాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నందుక దేశంలో కుల గణన జనగణన చాలా ముఖ్యమైన అంశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *