BANK FRAUDS 2025: తస్మాత్ జాగ్రత్త! బయంకరమైన బ్యాంక్ మోసాలు విపరీతంగా పెరిగాయి

బ్యాంక్ మోసాలు

ముఖ్యమైన బ్యాంక్ మోసాలు:

హైదరాబాద్‌లో వృద్ధులపై మోసం: ఒక 80 ఏళ్ల రిటైర్డ్ ప్రొఫెసర్ రూ. 2.12 కోట్లు, మరో 68 ఏళ్ల వ్యాపారవేత్త రూ. 1.74 కోట్లు కోల్పోయారు. వీరిద్దరినీ బెంగళూరు పోలీసులుగా నటించిన మోసగాళ్లు మోసం చేశారు.

ఐడీబీఐ బ్యాంక్ లోన్  మోసం: కిసాన్ క్రెడిట్ స్కీమ్‌ను దుర్వినియోగం చేసి రూ. 2.86 కోట్ల మోసం జరిగింది. ముంబైలోని బ్యాంక్ మేనేజర్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు.

ఫేక్ కాల్ సెంటర్ స్కాం: విశాఖపట్నం అచ్చుటాపురంలో నకిలీ కాల్ సెంటర్ ద్వారా అమెరికన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని రూ. 600 కోట్ల మోసం జరిగింది. 33 మందిని అరెస్ట్ చేశారు. చీట్‌ఫండ్ సంస్థలు: శ్రీకాకుళం జిల్లాలో అనధికారిక చిట్ ఫండ్ సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నాయి. అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు తీసుకుని పరారయ్యారు.

బ్యాంక్ మోసాలు

 బ్యాంక్ మోసాలు నుండి తీసుకోవలసిన జాగ్రత్తలు:

అధిక లాభాలు: అసాధ్యమైన లాభాలు వాగ్దానం చేసే స్కీమ్స్‌ను నమ్మవద్దు.

అనధికారిక లింకులు: అనుమానాస్పద లింకులు, ఫన్నీ మీమ్స్ ద్వారా వచ్చే ఫైళ్లను ఓపెన్ చేయవద్దు. ఇవి మాల్వేర్‌ను కలిగి ఉండవచ్చు.

అధికారిక సంస్థలు: చిట్ ఫండ్ లేదా ఇతర పెట్టుబడి సంస్థలు అధికారికంగా నమోదు అయ్యాయా లేదా అని పరిశీలించండి .

ఫిర్యాదు: మోసానికి గురైతే వెంటనే సంబంధిత బ్యాంక్‌ను సంప్రదించి ఖాతాను బ్లాక్ చేయించండి. స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయండి.

 ఈ మోసాలపై అవగాహన పెంచుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన ఆర్థిక భద్రతను కాపాడుకోవచ్చు.

2024-25లో తగ్గిన బ్యాంక్ మోసాలు .. నష్టాలు మూడింతలు పెరిగాయి

బ్యాంక్ మోసాలు

బ్యాంక్ మోసాలు గురించి రిజర్వుబ్యాంక్‌ ఈ సంవత్సరం ఇచ్చిన నివేదికలో తెలిపారు

 బ్యాంకింగ్‌లో మోసాలను నియంత్రించడానికి రిజర్వు బ్యాంక్‌ చేస్తున్న ప్రయత్నాలు విపలమైయ్యాయి . రుణ ఖాతాలు, డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించి సంఖ్య పరంగా తగ్గినప్పటికి విలువ పరంగా చూస్తే మాత్రం మూడింతలు పెరిగాయి. 2024 సంవత్సరానికిగాను రిజర్వు బ్యాంక్‌ విడుదల చేసిన  నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంచేసింది.

24-25 ఆర్థిక సంవత్సరంలో రూ.36,014 కోట్ల విలువైన మోసాలు జరిగాయని తెలియజేసింది . అంతక్రితం ఏడాది రూ.12,230 కోట్ల మోసాలు జరిగాయి. సంఖ్యపరంగా చూస్తే మాత్రం 2023-24లో 36,060 మోసాలు జరగగా, ఆ తర్వాతి ఏడాదికిగాను 23,953కి తగ్గాయి. ప్రధానంగా 122 కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు గడిచిన ఆర్థిక సంవత్సరంలో వర్గీకరించడం వల్లనే విలువ భారీగా పెరిగిందని తెలిపింది.

బ్యాంకింగ్‌ మోసాల్లో డిజిటల్‌ పేమెంట్లు, కార్డు, ఇంటర్నెట్‌ ద్వారా జరిగే మోసాలు అధికంగా ఉన్నాయని పేర్కొంది. మొత్తం మోసాల్లో 60 శాతం మోసాలు ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లోనే జరిగాయని తెలిపింది. మొత్తం విలువల్లో వీటి వాటా 71 శాతంగా ఉన్నది. కార్డు/ఇంటర్నెట్‌ ద్వారా జరిగే మోసాలు అధికంగా 13,516గా నమోదయ్యాయి. మొత్తం 23,956 మోసాల్లో వీటి వాటా 56.5 శాతంగా ఉన్నది. లక్ష రూపాయల కంటే అధికంగా నమోదైన మోసాల గురించి ఆర్బీఐ వివరించింది.

ఆర్బీఐ ఇచ్చిన ముఖ్యమైన  అంశాలు..

  • ముక్కలు చేసిన నోట్లతో కణ బోర్డులను తయారు చేస్తున్నారు.
  • డిజిటల్కరెన్సీ లావాదేవీలు రూ.1,016 కోట్లుగా నమోదయ్యాయి. 2024 సంవత్సరంలో రూ.234 కోట్లుగా ఉన్నాయి.
  • ప్రస్తుతం రిజర్వుబ్యాంక్‌ వద్ద 879.58 మెట్రిక్‌ టన్నుల విలువైన గోల్డ్‌ రిజర్వులు ఉన్నాయి. అంతక్రితం ఏడాది 822.10 మెట్రిక్‌ టన్నులు ఉన్నాయి.
  • 311.38 మెట్రిక్టన్నుల విలువైన పసిడి ఆస్తులు కలిగివుండగా, మిగతా 568.20 మెట్రిక్టన్నుల విలువైన పసిడి బ్యాంకింగ్డిపార్ట్మెంట్ల వద్ద ఉన్నది.
  • గడిచిన ఆర్థిక సంవత్సరంలో అదనంగా 54.13 మెట్రిక్‌ టన్నుల విలువైన పసిడిని కొనుగోలు చేసింది.

ట్రావెల్ గైడ్ మరియు మొనాకో సిటీ గురించి పూర్తి సమాచారం చదవండి CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *