కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లి గ్రామంలో నిన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ ఇల్లు స ధ్వంసం కావడం జరిగింది. ఈ ఘటనలో ఇంట్లోని నిత్యావసర సరుకులు మరియు ఇతర సామాగ్రి పూర్తి గా ధ్వంసం అయ్యాయి . ఎమ్మెల్యే గారు వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. HP గ్యాస్ మేనేజ్మెంట్ తో మాట్లాడి వారికి సంబంధించిన ఇన్సూరెన్స్ మరియు నష్టపరిహారం తొందరగా వచ్చే విధంగా చూడాలని వారికి సూచన చేయడం జరిగింది. స్థానిక ఎమ్మార్వో మరియు ఎంపీడీవో గారికి ఆర్ఐ గారికి వారికి తొందరగా సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది.

ప్రమాద సమయంలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడం సంతోషకరం అని పేర్కొంటూ, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ RI శ్రీహరి మరియు నాయకులు మాజీ జిల్లా కోప్షన్ మెంబెర్ మన్సూర్,దుర్గా రెడ్డి,రాజి రెడ్డి మాజీ సర్పంచ్ ఎల్లయ్య జడ్పీటీసీ కవిత అమర్ సింగ్ మాజీ వైస్ ఎంపీపీ నవీన్ గుప్తా ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ మాజీ సర్పంచ్ సంజీవ్, మాజీ ఉప సర్పంచ్ ఊరట్ల శివ,మాజీ సర్పంచ్శేఖర్ గుప్తా,సత్య గౌడ్, కల్లూరి సంజీవ,లక్ష్మయ్య రామాంజనేయులు,సందీప్,భిక్షపతి,లింగం తదితరులు పాల్గొన్నారు.
