YOGA 2025: యోగా అంటే ఏంటి దానివల్ల కలిగే అద్బుతమైన లాభాలు తెలుసుకొండి

YOGA

2025 సంవత్సరంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. యోగాను అంతర్జాతీయ యోగా (Yoga) (IDY) డే గా గుర్తించి యోగా డే ఒక ముఖ్యమైన మైలు రాయిని దాటుతుంది. యోగాను శారీరక మానసిక మరియు ఆద్యాత్మిక శ్రేయస్సు పెంచే ప్రపంచ ఉద్యమంగా ప్రోత్సహించడం భారత దేశం అంతటా 2025 జూన్ 21 న ఉదయం 6:30 నుండి 7:45 వరకు భారత దేశం అంతటా 1 లక్షకు పైగా ప్రదేశాలలో కామన్ యోగా ప్రోటోకాల్ సామూహిక యోగా ప్రదర్శనను నిర్వహిస్తుంది ఈ జాతీయ కార్యక్రమానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో నాయకత్వం వహిస్తారు

అసలు YOGA అంటే ఏమిటి ?

యోగా అనేది సంస్కృత పద్యం నుండి వచ్చింది యోగా అంటే వ్యాయామ సాదనాల సమహారాల ఆద్యాత్మిక రూపం. ఇది హిందూ సంప్రదాయ ఆద్యాత్మిక సాధనాలలో ఒక భాగం. యోగాను సాధన చేసే వారిని యోగులు అని పిలుస్తారు. ధ్యాన యోగం ఆద్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఇది శారీరక మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడి మందుల వాడకాన్ని తగ్గించి దేహానికి బలాన్ని ముఖ్య వర్చస్సును ఇనుమడింప చేస్తుంది. ఇది బుద్దమతం, జైన మతం శిక్కుమతం మొదలైన మతాలలో దీని యొక్క ప్రదాన్యత కనిపిస్తుంది

YOGA ఎలా ప్రారంభం అయింది

హిందూ ఆద్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని ఒకచోట చేర్చిన ఆద్యుడు పతంజలి. పూర్వము 100 వ శకము నుండి 500 వ శకము మధ్య కాలంలో ఈ రచన జరిగినట్లు పరిశోదకలు చెబుతున్నారు . వేదములు పురాణాలు ఉపనిషత్తులు రామాయణము బాగవతము భారతము భాగవద్గీతలలో యోగా ప్రస్తావన ఉన్నది. పతంజలి వీటిని పతంజలి యోగా సూత్రాలుగా క్రోడీకరించి యోగా శాస్త్రాన్ని ఒక చోట చేర్చారు

For more details Please Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *