కౌడిపల్లి లో రైతు లకు మద్దతూ గా వర్షంలో MLA సునీతలక్ష్మారెడ్డి ధర్నా

కౌడిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లో అక్రమంగా 50MVA బూస్టర్ ను సదాశివపేట్ కు షిఫ్ట్ చేసి దాని బదులు 10/16 MVA ని పెట్టడం వలన కౌడిపల్లి, కొల్చారం, చిలెప్ చెడు మండలాలల్లో లో వోల్టేజ్ సమస్యతో రైతుల పంటలు ఎండిపోతుండడం మరియు వోల్టేజ్ సమస్యతో పంపుసెట్లు పాడవడం రాత్రి రెండు గంటల తర్వాత త్రీఫేస్ ఇవ్వడం వలన రైతులు తీవ్ర ఇబ్బందిగా గురవుతున్నారు. రైతులకు మద్దతుగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు,రైతుల కోసం బిఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కౌడిపల్లి,కొల్చారం,చిలప్ చెడ్ మండలానికి సంబంధించి మండల అధ్యక్షులు మాజీ జడ్పిటిసిలు ఎంపీపీలు, ఎంపిటిసిలు సర్పంచులు గ్రామ అధ్యక్షులు వివిధ అనుబంధ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఈ ధర్నా పెద్ద ఎత్తున జరగడంతో స్పందించిన విద్యుత్ అధికారులు ఏడి రమణారెడ్డి,ఏఈ శరత్ కుమార్, వారికి రైతులు మరియు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మెమోరండం ఇవ్వడం జరిగింది.వారం రోజుల్లో సదాశివపేటకు తరలించిన 50MVA బూస్టర్ ను తిరిగి కౌడిపల్లి విద్యుత్ సబ్స్టేషన్లో అమరుస్తామని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారికి తెలియజేశారు. ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మంచి చేయకపోయినా 24 గంటలు కరెంటు అని చెప్పి పూర్తిగా ఇవ్వకుండా రైతులకు కనీసం ఉన్నటువంటి ని తొలగించి రైతులకు ఇబ్బంది చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రైతుల పక్షాన ఎప్పుడూ బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.వారం రోజులు కాదు పది రోజులలో బూస్టర్ ను తిరిగి అమర్చకపోతే మరోసారి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు మూడు మండలాల ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ ముందు ఉంటుందని రైతు పక్షాన ప్రతిక్షణం పోరాటం చేయడం జరుగుతుందని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *