అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) ద్వారా పీజీ మరియు డిగ్రీ చేయాలి అనుకునే వారికి యూనివర్సిటీ మరొక్కసారి అడ్మిషన్ తేదీ పొడిగించి చక్కటి అవకాశాన్ని అందించింది ఈ యొక్క తేదీ ఆగస్టు 30 వరకు ఉన్న తేదీని తాజాగా 12-09-2025 వరకు పొడగించింది

డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) విద్యార్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 12 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.*
కొత్తగా అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులతో పాటు, ఇప్పటికే యూనివర్సిటీలో చదువుతున్న వారికి కూడా ఫీజు చెల్లింపు గడువు పొడిగించారు. 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ కోర్సుల్లో చేరిన సెకండ్, థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, అలాగే అంతకుముందు అడ్మిషన్ పొంది ఫీజు చెల్లించని విద్యార్థులు అందరూ సెప్టెంబర్ 12 లోపు తమ ట్యూషన్ ఫీజును ఆన్లైన్ లో చెల్లించాలని సూచించారు